Top
Batukamma

ప్రియుడితో క్వారంటైన్ లో లేడీ కానిస్టేబుల్.. ఎలా దొరికారంటే..!

ప్రియుడితో క్వారంటైన్ లో లేడీ కానిస్టేబుల్.. ఎలా దొరికారంటే..!
X
Highlights

కరోనా వైరస్ ప్రాణాలు తీస్తున్నా.. అక్రమ సంబంధాలను మాత్రం బట్టబయలు చేస్తోంది. వైరస్ సోకిన వారి ప్రైమరీ...

కరోనా వైరస్ ప్రాణాలు తీస్తున్నా.. అక్రమ సంబంధాలను మాత్రం బట్టబయలు చేస్తోంది. వైరస్ సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్స్ వివరాలు రాబడుతున్న సమయంలో చాలా కేసుల్లో అక్రమసంబంధాలు బటయపడ్డాయి. తాజాగా నాగ్ పూర్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

నాగపూర్ లో పనిచేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్ కు స్థానికంగా ఉండే ఓ పోస్టల్ ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఏడాది నుంచి ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. అయితే.. అతడికి అప్పటికే పెళ్లైంది. భార్య కూడా ఉంది.

ఇటీవల కానిస్టేబుల్ పనిచేస్తున్న స్టేషన్ లో ఓ అధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రైమరీ కాంటాక్ట్ కింద లేడీ కానిస్టేబుల్ ను క్వారంటైన్ లో పెట్టారు. ఆమె ప్రైమరీ కాంటాక్ట్ ల గురించి ఆరా తీయగా తన ప్రియుడి పేరు చెప్పింది. అయితే.. అతడు తన భర్త అని చెప్పడంతో అధికారులు ఒకే గది ఇచ్చారు.

వీళ్ల వ్యవహారం బాగానే ఉన్నా.. తన భర్త కనిపించడం లేదంటూ పోస్టల్ ఉద్యోగి భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో వెతుకులాట మొదలుపెట్టిన పోలీసులు అతగాడు ప్రేయసితో క్వారంటైన్ లో ఉన్నట్టు గుర్తించారు.

Next Story
Share it