Top
Batukamma

కమలా హ్యారిస్ గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

కమలా హ్యారిస్ గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
X
Highlights

కమలా హ్యారిస్ చిన్నతనం నుంచే నల్లజాతియులుగా వివక్షను ఎదుర్కొన్నారు. సెలవుల్లో తండ్రి దగ్గరకు వెళ్లినప్పుడు ఇరుగు పొరుగు వారు నల్లజాతీయులుగానే చూశారు.



కమలా హ్యారిస్ 1964 లో జన్మించారు.. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందిన వారు కాగా, తండ్రి డొనాల్డ్ జె హారిస్.. ఈయన జమైకాకు చెందినవాడు..


కమలా హ్యారిస్ కు ఏడేళ్ల వయస్సున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. శ్యామల ఒంటిరిగానే కుమార్తెలు ఇద్దర్నీ పెంచి పెద్దచేశారు.


కమలా హ్యారిస్ చిన్నతనం నుంచే నల్లజాతియులుగా వివక్షను ఎదుర్కొన్నారు. సెలవుల్లో తండ్రి దగ్గరకు వెళ్లినప్పుడు ఇరుగు పొరుగు వారు నల్లజాతీయులుగానే చూశారు.


తమను నల్లజాతియులుగానే చూస్తుందన్న విషయం అర్థమైందని.. అందుకే ఆత్మవిశ్వాసంతో గర్వించే నల్లజాతి మహిళలుగా తీర్చిదిద్దాలని తన తల్లి నిర్ణయించుకొన్నట్టు.. తన ఆత్మకథ ద ట్రూత్ వియ్ హోల్డ్ లో కమల హ్యారిస్ రాశారు.



వాషింగ్టన్ లోని హొవార్డ్ యూనివర్సిటీలో కమల చేరారు.కాలిఫోర్నియోలోని హేస్టింగ్స్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అక్కడ బ్లాక్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1990లో కాలిఫోర్నియాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు.


2002లో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికవడం కమల జీవితాన్ని మలుపుతిప్పింది. ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తి ఆమే కావడం విశేషం.


ట్రాన్స్ జెండర్లు వేధింపులకు గురవుతుండడంతో వారికి రక్షణ కల్పించేందుకు హేట్ క్రైం విభాగాన్ని ప్రారంభించారు. ఉరిశిక్షకు బదులు జీవితాంతం జైలులో ఉంచేలా చట్టాల్లో మార్పులు చేయాలని ఆమె కోరారు. ఈ విషయంలో ఒత్తిడి వచ్చినా ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదు.



అక్షరాస్యత పెంచే విషయంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోతే తల్లిదండ్రులకు శిక్ష విధించడం ప్రారంభించారు. సరైన కారణం లేకుండా 50 రోజుల పాటు పిల్లలు స్కూలుకు రాకుంటే తల్లిదండ్రులకు శిక్షలు వేశారు.ఇలాంటి శిక్షలు పడటం శాన్ ఫ్రాన్సిస్కో లో మొదటిసారి.


2011లో శాన్ ఫ్రాన్సిస్కో అటార్నీ జనరల్ గా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళ కూడా ఆమెనే. 2014లో మరోసారి శాన్ ఫ్రాన్సిస్కో అటార్నీ జనరల్ అయ్యారు. 2016లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున సెనేట్ కు ఎన్నికై జాతీయ రాజకీయల్లోకి వచ్చారు.



కమల హ్యారీస్.. ముందునుంచి అధ్యక్ష పదవిపైనే దృష్టి పెట్టారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తానంటూ ఆమె ప్రకటించారు కూడా. పార్టీ అభ్యర్థిగా తననే ఎంచుకోవాలంటూ ప్రచారం కూడా చేశారు. ఈ సందర్భంగా జో బిడెన్ పై విమర్శలు కూడా చేశారు. చివరకు బిడెన్ అధ్యక్ష అభ్యర్థి అయ్యారు.

Next Story
Share it