Top
Batukamma

జో బైడెన్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

జో బైడెన్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
X
Highlights

బిడెన్ ఫ్యామిలీ 1955లో డెలావర్ లోని మెఫిల్డ్ కు వలస వెళ్లింది. జొ బిడెన్ కు చిన్నప్పుడు నత్తి సమస్య ఉండేది. దీంతో తోటి పిల్లలు ఆయనను గేలి చేసేవారు.

జొ బిడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.


1. జొ బిడెన్ పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్ లో 1942 నవంబర్ 20న ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి జోసఫ్ ఓ చిన్న ఉద్యోగి. తల్లి కేథరిన్ గృహిణి. బిడెన్ ఫ్యామిలీ 1955లో డెలావర్ లోని మెఫిల్డ్ కు వలస వెళ్లింది. జొ బిడెన్ కు చిన్నప్పుడు నత్తి సమస్య ఉండేది. దీంతో తోటి పిల్లలు ఆయనను గేలి చేసేవారు.


2. బిడెన్ కు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలాసార్లు చెప్పారు. నా పేరు జొ బిడెన్... నాకు ఐస్ క్రీం అంటే ఇష్టం.. నేను మద్యం తాగను.. స్మోక్ చేయను.. కానీ నేను చాలా ఎక్కువగా ఐస్ క్రీం తింటాను. అంటూ ఓ సభలోనే చెప్పారు. '


3. తనకు ఇష్టమైన సినిమా గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు బిడెన్. చారిట్స్ ఆఫ్ ఫైర్ సినిమా తనకు ఇష్టమని చెప్పారు.


4. 1965లో యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్ లో బీఏ కంప్లీట్ చేశారు. 1966లో సిరాక్యూస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నీలియాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు బిడెన్. 1968లో సిరాక్యూస్ విశ్వవిద్యాలయం లా స్కూల్ లో న్యాయవిద్యను పూర్తిచేశారు. విల్మింగ్టన్ లో ఒక లా సంస్థలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1971లో సొంతంగా లా సంస్థను ఏర్పాటు చేశారు.


5. విల్మింగ్టన్ లో ఓ న్యాయసేవా సంస్థలో పనిచేస్తున్నప్పటి నుంచే డెమొక్రటిక్ పార్టీలో పనిచేయడం మొదలుపెట్టారు. 1970లో తొలిసారి డెమొక్రటిక్ పార్టీ తరపున న్యూ కాజిల్ కౌంటీ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. జొ బిడెన్ 1972లో డెలావర్ సెనెటర్ గా ఎన్నికయ్యారు. అమెరికా చరిత్రలో అతిచిన్న వయస్సులోనే సెనెటర్ గా ఎంపికైన వారిలో బిడెన్ ఐదో వ్యక్తి.


6. 1972లో బిడెన్ భార్యాపిల్లలు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆయన భార్య నీలియా, ఏడాది వయసున్న కూతురు అమీ చనిపోయారు. కుమారులు బ్యూ, హంటర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదంతో కుంగిపోయిన బిడెన్.. ఓ దశలో ఆత్మహత్య చేసుకొందామనుకున్నారు. కానీ కుటుంబం అండతో తిరిగి నిలదొక్కుకోగలిగాడు. 1977లో జిల్ ట్రేసీ జాకబ్స్ అనే టీచర్ ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు బిడెన్.


7. చాలా కాలం పాటు సెనేటర్ గా పనిచేశారు బిడెన్. 1973 నుంచి 2009 వరకు సెనేటర్ గా ఉన్నారు. విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. సోవియట్ తో కలిసి అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించిన ఒప్పందాల్లో ఆయనది కీలకపాత్ర. సోవియట్ మాజీ దేశాలను చేర్చుకొని నాటో కూటమి విస్తరణలో కీలకంగా వ్యవహరించారు.

8. అమెరికా అధ్యక్షుడయ్యేందుకు బిడెన్ చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. దాదాపు 34 ఏళ్ల పాటు ఆయన దీనికోసం వెయిట్ చేశారు. 1987లోనే డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి పోటీలో ఉన్నానని ప్రకటించారు. కానీ ప్రసంగం కాపీ కొట్టారనే ఆరోపణలు, అనారోగ్య సమస్యలతో అప్పుడు పోటీ నుంచి తప్పుకున్నారు. 2007 లోనూ మరోసారి ప్రయత్నించారు. కానీ హిల్లరీ, ఒబామాను దాటుకుని ముందుకెళ్లలేకపోయారు.


9.బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాలనలో బిడెన్ చాలా కీలకంగా ఉన్నారని చెబుతుంటారు. విధానపరమైన నిర్ణయాలు, కీలక చట్టాల తయారీలో ప్రధానపాత్ర పోషించిందిబిడెన్ అని చెబుతుంటారు.

10. బిడెన్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులైన వారందరిలోకి ఈయనే వృద్ధుడు. ప్రస్తుతం ఆయన వయస్సు 77 ఏళ్లు. ఆయన పదవి చేపట్టే నాటికి 78 ఏళ్ల వయసులోకి అడుగు పెడతారు.

Next Story
Share it