Top
Batukamma

చీరకట్టులో బ్యాట్ పట్టిన బ్యూటీ.. ఏంటీ సంగతి..?

చీరకట్టులో బ్యాట్ పట్టిన బ్యూటీ.. ఏంటీ సంగతి..?
X
Highlights

పెళ్లికి ముందైనా తర్వాతైనా ఫొటో, వీడియో షూట్ ఉండాల్సిందే. దీనికోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా యువత వెనకాడటం లేదు.

ప్రీ వెడ్డింగ్ షూట్ లు , పోస్ట్ వెడ్డింగ్ షూట్ లు ఇప్పుడు ఓ స్టేటస్ ఇష్యూ అయిపోయాయి. పెళ్లికి ముందైనా తర్వాతైనా ఫొటో, వీడియో షూట్ ఉండాల్సిందే. దీనికోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా యువత వెనకాడటం లేదు.

అయితే.. బంగ్లాదేశ్ కు చెందిన మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లాం మాత్రం వెరైటీగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. అందమైన చీరకట్టులో, చేతిలో బ్యాట్ తో పొటోలకు ఫోజులిచ్చింది.

సాంప్రదాయ పద్దతిలో నారింజ రంగు చీరలో.. ఒంటి నిండా నగలతో ఫొటోలకు ఫోజులిచ్చింది సంజిదా ఇస్లాం.


మరో విశేషం ఏంటంటే ఈమె పెళ్లి చేసుకుంది కూడా క్రికెటర్ నే. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మిమ్ మొసద్దీక్ ను పెళ్లి చేసుకుంది.


క్రికెట్ అంటే తనకు ప్రాణమని.. అందుకే ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా ప్లాన్ చేసినట్టు చెబుతోంది సంజిదా.


సంజిదా ఫొటోలు చూసిన ICC.. క్రికెటర్ల వెడ్డింగ్ ఫొటోలు ఇలాగే ఉంటాయంటూ ట్వీట్ చేసింది.

ఇక.. 24 ఏళ్ల సంజిదా 2012లో బంగ్లాదేశ్ టీంలోకి ఎంట్రీ ఇచ్చింది. 8 ఏళ్ల కెరీర్ లో 16 వన్డేలు, 54 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడింది.

Next Story
Share it