Top
Batukamma

బాప్ రే... ట్రంప్ గెలిస్తే 112 కోట్లు..!

biggest bet on donald trump victory
X
Highlights

ఏ ఎన్నికలపైన కూడా ఈ రేంజ్ లో పందెం కట్టిన దాఖలాలు లేవని స్వయంగా బెట్టింగ్ రాయుళ్ళు అంటున్నారు.

Biggest bet on donald trump victory: ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు ఇప్పుడు ఉత్కంఠని రేపుతున్నాయి. కొన్ని సర్వేలు ట్రంప్ విజయం ఖాయం అని పోలింగ్ కి ముందు చెబితే.. మరికొన్ని సర్వేలు బైడెన్‌ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ తమ సర్వేలను రిలీజ్ చేశాయి. అయితే పోలింగ్ కి వచ్చేసరికి పోటాపోటీ నడుస్తుందని తమ అంచనాలను తెలియజేశాయి.

ఇక ఈ ఎన్నికల పైన ఇప్పుడు భారీ బెట్టింగ్ లు నడుస్తున్నాయి. ట్రంప్ విక్టరీ పక్కా అని నమ్మి బ్రిటన్‌కు చెందిన ఓ మాజీ బ్యాంకర్‌ ఒకరు ఏకంగా ఐదు మిలియన్‌ డాలర్లు (దాదాపు 37.5 కోట్ల రూపాయలు) పందెం కట్టాడు. కరీబియన్‌లోని కురకావోలో ఓ బుక్‌ మేకర్‌తో ఈ పందెం కట్టాడట. ప్రపంచంలోని ఏ ఎన్నికలపైన కూడా ఈ రేంజ్ లో పందెం కట్టిన దాఖలాలు లేవని స్వయంగా బెట్టింగ్ రాయుళ్ళు అంటున్నారు.

అయితే తానూ ఎదో గుడ్డి నమ్మకంతో ట్రంప్‌ గెలుస్తాడంటూ బెట్‌ కట్టలేదని, ట్రంప్ కి సంబంధించిన ఇన్‌ సైడర్లతోని సంప్రదింపులు జరిపే ఈ బెట్టింగ్ కట్టనాని సదరు మాజీ బ్యాంకర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధిస్తే మాజీ బ్యాంకర్‌కు కాచిన బెట్ కన్నా మూడింతలు అంటే, 11.6 మిలియన్‌ పౌండ్లు (దాదాపు 112 కోట్ల రూపాయలు) వస్తాయి.

ఇదొక్కడే కాదు.. ఇలా అమెరికా ఎన్నికల ఫలితాల మీద జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయట. ప్రపంచంలోని చాలా దేశాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై బెట్టింగ్ (Biggest bet on donald trump victory)నడుస్తోందని టాక్.

అటు అమెరికాలో పోలింగ్ స్టార్ట్ అయింది.. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు న్యూయార్క్‌, న్యూజెర్సీ, వర్జీనియాలో పోలింగ్‌ను ప్రారంభించారు. ఓటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అమెరికా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అమెరికన్లకు ముందస్తుగా ఓటేసే వీలుంది. కరోనా కారణంగా ఇప్పటికే 9.9 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- దుబ్బాకలో ఎగ్జిట్ పోల్ టెన్షన్.. హరీశ్ రావు పరిస్థితి ఏంటీ..?

- దుబ్బాకలో టీఆర్ఎస్ ఖేల్ ఖతం.. బీజేపీదే గెలుపంటున్న సర్వేలు..!

Next Story
Share it