Top
Batukamma

జీతం చాలడంలేదట.. ప్రధాని పోస్ట్ కి గుడ్ బై!

జీతం చాలడంలేదట.. ప్రధాని పోస్ట్ కి గుడ్ బై!
X

British Prime Minister Boris Johnson

Highlights

ప్రధాని పోస్ట్ అంటే మాములు విషయమా... ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది దొరకదు.. సకల సౌకర్యాలు ఉంటాయి.. కానీ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ కి మాత్రం ఆ పదవిలో ఉంటే వచ్చే జీతం సరిపోవడం లేదట..

ప్రధాని పోస్ట్ అంటే మాములు విషయమా... ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది దొరకదు.. సకల సౌకర్యాలు ఉంటాయి.. కానీ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ కి మాత్రం ఆ పదవిలో ఉంటే వచ్చే జీతం సరిపోవడం లేదట.. అందుకే ఆ పదవి నుంచి దిగిపోవాలని జాన్సన్‌ యోచిస్తున్నట్లుగా బ్రిటన్‌ మీడియా కథనాలను వెల్లడించింది..

బ్రెగ్జిట్‌ అనంతరం జాన్సన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లుగా ఒక పార్లమెంట్‌ మెంబర్‌ వెల్లడించారు.. ప్రధానిగా జాన్సన్ కి వచ్చే జీతం కన్నా గతంలో ఆయన చేసిన జాబ్ వల్లే ఎక్కువ జీతం వస్తుందట..

ప్రస్తుతం ప్రధానిగా జాన్సన్ 1.5 లక్షల డాలర్లను వేతనంగా పొందుతున్నాడు.. ఆయన ప్రధాని కాకముందు టెలిగ్రాఫ్‌ పత్రికలో కాలమిస్టుగా పనిచేశారు. అక్కడ ఆయన ఏటా 2.75 లక్షల పౌండ్ల వేతనాన్ని పొందేవారట.. అంతేకాకుండా ప్రసంగాల ద్వారా 1.6 లక్షల పౌండ్లు ఆర్జించేవారట..

అయితే ఇప్పుడు ప్రధానిగా వచ్చే జీతం ఆయనకి సరిపోవడం లేదట.. ప్రస్తుతం బోరిస్‌కు ఆరుగురు పిల్లలున్నారు. విడాకులు ఇచ్చిన మొదటి భార్య అలెగ్రా మెస్టిన్ కు భరణం ఇవ్వాలి. ఇవ్వని తనకి వచ్చే జీతాల్లో సరిపోవడం లేదని వాపోతున్నారట.. ప్రస్తుతం ఆయన ఇంట్లో హౌస్‌కీపర్‌ కూడా లేరని బ్రిటన్ మీడియా రాసుకొచ్చింది..

ఇక బోరిస్ జాన్సన్‌ ఇద్దరితో విడాకులు తీసుకున్నారు.. మెరీనా వీలర్‌తో వివాహం కాగా వీరికి నలుగురు సంతానం ఉన్నారు.. ఆ తరవాత అలెగ్రా మెస్టిన్ ను పెళ్లాడాడు బోరిస్.. ఇక వీరు 1993లో విడిపోయారు.. అనంతరం అధికార కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్‌గా పనిచేసిన క్యారీ సైమండ్స్‌తో కలిసి జీవిస్తున్నారు.

Next Story
Share it