Top
Batukamma

7 కోట్ల ఓట్లు వచ్చాయ్.. నేనే గెలిచా: ట్రంప్

7 కోట్ల ఓట్లు వచ్చాయ్.. నేనే గెలిచా: ట్రంప్
X
Highlights

అయితే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో తానే గెలిచానని తాజాగా ట్వీట్ చేశారు

ఉత్కంఠ భరితంగా సాగిన అమెరిక అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో జో బైడెన్ ట్రంప్ పైన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో ముందునుంచి ట్రంప్ పైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన బైడెన్ ఫైనల్ గా విక్టరీ కొట్టారు..

ఈ ఎన్నికల్లో బైడెన్ కి 284 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ కి 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.. బైడెన్ విజయం సాధిచడంతో అయన వచ్చే ఏడాది జనవరి 20 న 46 వ అమెరికా అధ్యక్షడుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెప్పట్టనున్నారు..

అయితే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో తానే గెలిచానని తాజాగా ట్వీట్ చేశారు. 'కౌంటింగ్ రూంలలోకి మా అబ్జర్వర్లను అనుమతించలేదు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. నాకు 7 కోట్ల 10 లక్షల లీగల్ ఓట్లు వచ్చాయి.

అమెరికా చరిత్రలో సిట్టింగ్ ప్రెసిడెంట్ కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. నేనే గెలిచా' అని ట్రంప్ పేర్కొన్నారు.



ట్రంప్ చెత్త రికార్డు..

అమెరికా ఎన్నికల్లో ఓడిన ట్రంప్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నారు. 1992 తర్వాత రెండోసారి గెలవని తొలి అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. గత 231 ఏళ్లలో ట్రంతో కలిసి 11 మంది మాత్రమే వరుసగా రెండో సారి గెలవడంలో విఫలమయ్యారు.

వీరిలో కొందరు చనిపోగా, మిగతా వారు ఓటమి పాలయ్యారు. అమెరికాలో ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షునిగా పోటీ చేయవచ్చు. ఇప్పటి వరకు మొత్తం 45 మంది అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.

Next Story
Share it