Top
Batukamma

అమెరికాలో మళ్ళీ ట్రంపే!..

అమెరికాలో మళ్ళీ  ట్రంపే!..
X
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో హోరాహోరీ కనిపిస్తోంది. విజయం ట్రంప్, బిడెన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయ్యింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో హోరాహోరీ కనిపిస్తోంది. విజయం ట్రంప్, బిడెన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయ్యింది. దీంతో ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన ఇద్దరు నేతలు.. సాయంత్రానికి గెలుపు వార్త చెప్పబోతున్నానంటూ ట్వీట్ చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు దాదాపు ఖాయమైంది. మరో 7 స్థానాల్లో ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం బిడెన్ కు 238, ట్రంప్ కు213 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మరో 7 స్థానాల్లో కౌంటింగ్ జరగాల్సి ఉంది. వీటిలో రెండింటిలో బిడెన్ లీడ్ లో ఉన్నారు. నెవడ, విస్కాన్సిన్ లో బిడెన్ లీడ్ లో ఉన్నారు. ఈ రెండు రాస్ట్రాల్లో 16 ఎలక్టోరల్ ఓట్లున్నాయి.

మరో 5 స్థానాల్లో ట్రంప్ లీడింగ్ లో ఉన్నారు. మిచిగాన్, పెన్సిల్వేనియా, జార్జియా, అలస్కా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ లీడ్ లో ఉన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 70 ఎలక్టోరల్ ఓట్లున్నాయి.

ప్రస్తుతం బిడెన్ కు 238 ఓట్లు రాగా లీడింగ్ లో ఉన్న రెండు రాష్ట్రాలు కలిపితే 254 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయి. ట్రంప్ కు ప్రస్తుతం 213 ఓట్లున్నాయి. వీటికి లీడింగ్ లో ఉన్న 70 ఓట్లు కలిపితే ట్రంప్ కు 283 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రావాలి. 283 ఓట్లు ట్రంప్ కు వస్తే.. అమెరికా అధ్యక్షుడిగా గెలిచినట్టే.

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. వీరిలో 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో అధ్యక్ష ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలిఫోర్నియాలో 55, టెక్సాస్ 38, న్యూయార్క్, ఫ్లోరిడాలో 29, పెన్సిల్వేనియా, ఇల్లినాయిస్ లో 20 చొప్పున ఎలక్టోరల్ ఓట్లున్నాయి.

అయితే.. బిడెన్ ఇప్పటికే 238 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. కానీ.. ఆయన గెలిచిన రాష్ట్రాలన్నీ కూడా చిన్నవే. వాటిలో ఎలక్టోరల్ ఓట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో బిడెన్ ఓటమి తప్పేలా లేదు.

ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు : కెంటకీ, ఇండియానా, టెన్నెస్సీ, వెస్ట్ వర్జీనియా, ఒక్లాహామా, మిసిసిప్పి, అలబామా, అర్కాన్సాస్, సౌత్ డకోటా, నార్త్ డకోటా, ఇడాహో, నెబ్రాస్కా, మిస్సోరి, ఉటా, కాన్సాస్ , సౌత్ కరోలినా, లూసియానా, వ్యోమింగ్, ఒహియో

బిడెన్ గెలిచిన రాష్ట్రాలు : కాలిఫోర్నియా, ఒరెగావ్, వాషింగ్టన్, వెర్మాంట్, వర్జినియా, న్యూ జెర్సి, రోడ్ ఐలాండ్, మసాచ్యూ సెట్స్, కొలరాడో, కనెక్టికట్, న్యూ హంప్ షైర్, న్యూ మెక్సికో, న్యూయార్క్ లో బిడెన్ గెలుపొందారు. మిచిగాన్ , నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, ఓహియో, విస్కిన్సన్ రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. మిన్నెసోటాలో బిడెన్ ముందున్నారు.

Next Story
Share it