DONALD TRUMP:పోతూ పోతూ మరోసారి ఇజ్జత్ తీసుకున్న ట్రంప్..!

ఆందోళనలను బిగ్ స్క్రీన్ పై చూస్తూ ట్రంప్ ఎంజాయ్ చేస్తున్న్ వీడియోలు బయటకు వచ్చాయి.
Donald trump impeachment : పదవితో పాటు పరువు కూడా పోగొట్టుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump). వారం రోజుల్లో ఆయన పదవీకాలం ముగుస్తోంది. ఇలాంటి టైంలో ఇటీవల జరిగిన అల్లర్లతో ఉన్న కాసింత పరువు కూడా తీసుకున్నారు.
క్యాపిటల్ హిల్(capital hill) దాడి విషయంలో అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ పై అభిసంశన తీర్మానం పెట్టారు. దీనికి మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపారు.
సొంత పార్టీ సభ్యులు కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ట్రంప్ అభిసంశనకు గురయ్యారు. ఇప్పటికే ఓ సారి ఆయనపై అభిసంశన తీర్మానం పెట్టగా అప్పుడు కూడా ట్రంప్ ఓడిపోయారు. రెండు సార్లు అభిసంశనకు గురైన అమెరికా అధ్యక్షుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు ట్రంప్.
అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ఆయనను పదవి నుంచి తొలగించాలని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని మొదట రిపబ్లికన్లు అడ్డుకున్నారు. దీనికి తాము రెడీగా లేమంటూ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ప్రకటించారు. అయిన పట్టుబట్టడంతో.. స్పీకర్ నాన్సీ పెలోసీ ఓటింగ్ నిర్వహించారు. దీనికి సెనెట్ ఆమోదం కూడా లభిస్తే ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
ఈ నెల 6 తేదీన వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ భవనంపై దాడి జరిగింది. నిరసనకారులు భవనంలోపలికి దూసుకెళ్లి రచ్చ రచ్చ చేశారు. దీంతో అందులో ఉన్న సభ్యులు కుర్చీల కింద దాక్కున్నారు. దీనికి ట్రంప్ కారణమని ఆరోపణలు వచ్చాయి.
ఆయన రెచ్చగొట్టడం వల్లే నిరసనకారులు క్యాపిటల్ హిల్ లోకి చొచ్చుకొచ్చారని డెమొక్రాట్లు ఆరోపించారు. దీనికి అనుగుణంగానే ఆందోళనలను బిగ్ స్క్రీన్ పై చూస్తూ ట్రంప్ ఎంజాయ్ చేస్తున్న్ వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఆయనపై అభిసంశన తీర్మానం పెట్టక తప్పలేదు.
- KTRకు సీఎం పదవి నిజమేనా..? KCR ఎప్పుడు దిగిపోతున్నారు..?