Top
Batukamma

బైడెన్‌ గెలుపు ఖాయం... తూచ్ అంటున్న ట్రంప్

బైడెన్‌ గెలుపు ఖాయం... తూచ్ అంటున్న ట్రంప్
X
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు హీట్ ఎక్కిస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ దూసుకుపోతున్నారు.. మొత్తం 538 కి గానూ 264 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి, మ్యాజిక్ ఫిగర్ కు 6 ఓట్ల దూరంలో ఉన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు హీట్ ఎక్కిస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ దూసుకుపోతున్నారు.. మొత్తం 538 కి గానూ 264 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి, మ్యాజిక్ ఫిగర్ కు 6 ఓట్ల దూరంలో ఉన్నారు. దీనితో అయన విజయం పక్కా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అటు ట్రంప్ కు 214 ఓట్లు వచ్చాయి. దీనితో ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించే అవకాశానికి కోల్పోయినట్టుననే అంటున్నారు.. ఇక ఇప్పటి వరకు 45 రాష్ట్రాల్లో ఫలితాలు రాగా అందులో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. అయితే అగ్రరాజ్యంలోని మిషిగన్‌, పెన్సిల్వేనియా రాష్ట్రాల కౌంటింగ్‌ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌కరోలైనా. అలస్కా, నెవాడా రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది.. ఒకవేళ ఇవన్నీ ట్రంప్‌ సొంతం చేసుకోగలిగితే ట్రంప్ అధ్యక్ష పదవిని అధిష్టించే మళ్లీ అవకాశం లేకపోలేదు.. అయితే ఇందులో నెవాడాలో బైడెన్‌ ముందునుంచి ఆధిక్యంలో ఉన్నారు.

అటు అగ్రరాజ్యంలో ఓటర్ల సంఖ్య 23.9 కోట్లు ఉండగా, ఈ ఎన్నికల్లో 66.9 శాతం పోలింగ్ నమోదైంది. గత 120 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం.. గతంలో 1900లో అమెరికాలో 70 శాతానికి పైగా మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజా ఎన్నికల్లో 10 కోట్ల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ల రూపంలో ఓటు వేయడం గమనార్హం.

Next Story
Share it