Top
Batukamma

ట్రంప్ కి మరో షాక్.. త్వరలో భార్యతో విడాకులు!

ట్రంప్ కి మరో షాక్.. త్వరలో భార్యతో విడాకులు!
X

Donald Trump, Melania Trump

Highlights

ట్రంప్ ఎప్పుడైతే వైట్ హౌస్ ని వీడుతారో వెంటనే మెలానియా ఆయనకి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు... ఇక ఇది ఇలా ఉంటే ట్రంప్‌, మెలానియాకి చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయట..

తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడిప్పుడే ఈ ఓటమి నుంచి తెరుకుంటున్న ట్రంప్ కి మరో షాక్ తగిలింది.. అయితే ఆ షాక్ వ్యక్తిగత జీవితం నుంచి కావడం గమనార్హం...

ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ ఆయనకు త్వరలోనే విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టుగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.. వైట్‌ హౌస్‌ని విడిచిపెట్టిన వెంటనే ట్రంప్ కి ఆమె విడాకులు ఇవ్వనున్నారని బ్రిటీష్‌ టాబ్లాయిడ్‌ డెయిలీ మెయిల్‌ ఒక కథనాన్ని ప్రచురించింది.

అయితే ఇదే విషయం పైన ట్రంప్‌ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్‌ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.. అసలు ట్రంప్‌, మెలానియాల మధ్య భార్యాభర్తల బంధం లేదని, కేవలం అవసరం కోసం మాత్రమే వారిద్దరూ అలా కాలం గడిపేస్తున్నారని అంటూ చెప్పుకొచ్చింది..

ట్రంప్ ఎప్పుడైతే వైట్ హౌస్ ని వీడుతారో వెంటనే మెలానియా ఆయనకి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు... ఇక ఇది ఇలా ఉంటే ట్రంప్‌, మెలానియాకి చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయట..ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన వెంటనే ఆమె వైట్ హౌస్ కి రాలేదు.. ట్రంప్ గెలిచాక అయిదు నెలలకి వైట్‌హౌస్‌కొచ్చారు.

ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో మెలానియా ఆయనకు విడాకులు ఇస్తే అవమానపరిచినట్టు అవుతుందని, అందుకే అప్పుడు సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడు ట్రంప్‌ ఓడిపోవడంతో ఆయన నుంచి విడిపోతారని బ్రిటీష్‌ టాబ్లాయిడ్‌ డెయిలీ మెయిల్‌ తన కథనంలో వెల్లడించింది.

వైట్ హౌస్ లోనే ఇద్దరు ఉన్నప్పటికీ ట్రంప్ దంపతులకి వేరు వేరు గదులు ఉండేవని గతంలో వార్తలొచ్చాయి కూడా.

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ కి 284 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ కి 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.. బైడెన్ విజయం సాధిచడంతో అయన వచ్చే ఏడాది జనవరి 20 న 46 వ అమెరికా అధ్యక్షడుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెప్పట్టనున్నారు..

Next Story
Share it