Top
Batukamma

బ్రిటన్ లో మళ్లీ లాక్ డౌన్.. కరోనాతో జాగ్రత్త..!

బ్రిటన్ లో మళ్లీ లాక్ డౌన్.. కరోనాతో జాగ్రత్త..!
X
Highlights

అయితే.. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి లాక్ డౌన్ లో చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు. నిత్యావసర సరుకులు, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రజలు బయటకు రావొచ్చన్నారు.

కరోనా వైరస్ మరోసారి తన ప్రభావాన్ని చూపిస్తోంది. వరుసగా ఒక్కో దేశంలో సెకండ్ వేవ్ భయం పుట్టిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్ డౌన్ విధించగా ఇప్పుడు బ్రిటన్ కూడా లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. లాక్ డౌన్ తప్పడం లేదని చెబుతోంది.

ఈ నెల 5వ తేదీ నుంచి బ్రిటన్ లో లాక్ డౌన్ విధించబోతున్నట్టు ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ నెల 5 నుంచి డిసెంబర్ 2 వరకు దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ప్రజలు కచ్చితంగా లాక్ డౌన్ రూల్స్ పాటించాల్సిందేనన్నారు.

అయితే.. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి లాక్ డౌన్ లో చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు. నిత్యావసర సరుకులు, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రజలు బయటకు రావొచ్చన్నారు. వర్క్ ఫ్రం హోం కే కంపెనీలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వర్క్ ఫ్రం హోం సాధ్యం కాని చోట మాత్రమే ఆఫీసులకు అనుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

అత్యవసరం కాని ప్రయాణాలు మానుకోవాలని బోరిస్ జాన్సన్ ప్రజలను కోరారు. నెల రోజుల తర్వాత కేసులు అదుపులోకి వస్తే.. అప్పటి పరిస్థితులను బట్టి లాక్ డౌన్ పొడిగించాల వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

బ్రిటన్ లో ఇప్పటి వరకు 1,011,660 మంది కరోనా బారిన పడ్డారు. 46 వేల 555 మంది ప్రాణలు కోల్పోయారు. ఇప్పటికీ వెయ్యి మంది వరకు సీరియస్ కండీషన్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్నారు.

Next Story
Share it