Top
Batukamma

అమెరికన్ల ప్రాణాలు తీస్తున్న ట్రంప్ ఎన్నికల ప్రచారం!

అమెరికన్ల ప్రాణాలు తీస్తున్న ట్రంప్ ఎన్నికల ప్రచారం!
X
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చాయి. ఎన్నికల ప్రచారం పేరుతో నేతలు చేస్తున్న హడావుడితో ప్రజల ప్రాణాలు పోతున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చాయి. ఎన్నికల ప్రచారం పేరుతో నేతలు చేస్తున్న హడావుడితో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్ తో అల్లాడుతోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మొదటిస్థానంలో అమెరికా ఉంది. అక్కడ ఇప్పటికీ భారీగానే కరోనా కేసులు వస్తున్నాయి. అయినా ఎన్నికలు వెళ్లేందుకు రెడీ అధ్యక్షుడు ట్రంప్. కొన్ని గంటల్లోనే అక్కడ పోలింగ్ కూడా జరగనుంది.

దీనికోసం జూన్ నుంచి భారీగా ప్రచారం చేస్తున్నారు ట్రంప్. అయితే.. ఈ సభలు కరోనా వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. దేశంలో వైరస్ కేసుల్లో పెరుగుదలతో.. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ఎకానమిస్ట్ లు దీనిపై అంచనా వేశారు.ట్రంప్ ఎన్నికల ప్రచార సభలకు హాజరైన 30 వేల మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. వీరిలో 700 మంది ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది క్రిటికల్ కండీషన్ లో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు 18 సభల్లో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సభలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఇందులో మూడు సభలు ఇండోర్ స్టేడియంలో జరిగాయి. దీనికితోడు.. ఎక్కడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించిన దాఖలాలు కనిపించలేదు. చాలామంది మాస్క్ లేకుండానే సభలకు హాజరయ్యారు. దీంతో కరోనా వ్యాప్తి పెరిగిందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

ట్రంప్ ప్రచారం వల్ల భారీగా కరోనా వైరస్ కేసులు పెరగడానికి మరో కారణం కూడా ఉంది. పెన్సుల్వేనియా, మిన్నెసొటా, విస్కొన్సిన్ లో ఆల్రెడీ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ట్రంప్ ఎన్నికల ప్రచారం చేశారు. వీటికి వేలాదిమంది వచ్చారు. కొవిడ్ నిబంధనలు పక్కన పెట్టేశారు. దీంతో 30 వేల మంది కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.

Next Story
Share it