Top
Batukamma

ట్రంప్ పై ట్విట్టర్ బాంబ్.. పరువంతా పాయే..!

ట్రంప్ పై ట్విట్టర్ బాంబ్.. పరువంతా పాయే..!
X
Highlights

Twitter Imposes Restrictons On Trump Account: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ...

Twitter Imposes Restrictons On Trump Account: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కష్టాలన్నీ ఒకేసారి మూటగట్టుకుని వచ్చి పడ్డాయి.

ప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన పుట్టెడు దు:ఖంలో ఉన్నాడు ట్రంప్. ఇదే సమయంలో భార్య విబేధాలు బయటపడ్డాయి. దీంతో త్వరలోనే ఇద్దరు విడాకులు తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇదే సమయంలో మరో వార్త ఇప్పుడు ట్రంప్ ను భారీ షాక్ ఇచ్చింది. ట్విట్టర్ రూపంలో ఇప్పుడు ట్రంప్ కు భారీ దెబ్బ తగిలింది.

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ట్రంప్ కు షాకిచ్చింది. ఇకపై ట్రంప్ పోస్టులకు ఎటువంటి మినహాయింపులూ ఉండబోవని తేల్చి చెప్పింది. ఆయన ట్విట్టర్ అకౌంట్ కూడా సాధారణ పౌరుల లాంటిదేనని చెప్పేసింది. ఇప్పటివరకూ ట్రంప్ చేసే ట్వీట్లను ప్రత్యేకంగా పరిగణించామని.. ఇకపై అదేమీ ఉండదని ప్రకటించింది.

(కింది ట్వీట్ లో హైడ్ చేసిన అలర్ట్ ను చూడొచ్చు)

ఆల్రెడీ గత వారంల రోజులుగా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆయన పెట్టిన కొన్ని ట్వీట్లను ట్విట్టర్ హైడ్ చేస్తూ వస్తోంది. తప్పుడు సమాచారం ఉందన్న కారణంతో ట్రంప్ ట్వీట్లను హైడ్ చేస్తూ వచ్చిన ట్విట్టర్ ఇప్పుడు.. అతను సాధారణ పౌరుడేనని అంటోంది.

ఫేస్ బుక్ , ట్విట్టర్ పాలసీ ప్రకారం, ఎన్నికల్లో పోటీ పడుతున్నవారు, పదవిలో ఉన్నవారు, క్యాబినెట్ మంత్రి స్థాయిలో ఉన్న వారి అకౌంట్ లకు ఫ్యాక్ట్ చెక్ నుంచి మినహాయింపు ఉంటుంది. వారు ఏ విషయాన్ని పోస్ట్ చేసినా దానిపై ట్విట్టర్ గానీ, ఫేస్ బుక్ గాని అభ్యంతరపెట్టవు. అయితే.. ఇప్పుడు ఈ విధానం మాజీలకు(Twitter Imposes Restrictons On Trump Account) వర్తించదని.. ట్విట్టర్ స్పష్టత ఇచ్చింది.

ఇది కూడా చదవండి:

- ట్రంప్ కి మరో షాక్.. త్వరలో భార్యతో విడాకులు!

- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Next Story
Share it