Top
Batukamma

వాట్సాప్ తో మరో ప్రమాదం..! గూగుల్ లో ప్రత్యక్షమైన చాటింగ్ లు..!

వాట్సాప్ తో మరో ప్రమాదం..! గూగుల్ లో ప్రత్యక్షమైన చాటింగ్ లు..!
X
Highlights

అన్నీ పర్సనల్ గానే నడుస్తున్నాయి కదా.. అని పర్సనల్ ఛాటింగ్లు చేస్తున్న చాలామందికి ఇది షాకింగ్ న్యూస్.

ఎప్పుడూ ఏదో టెక్నికల్ సమస్యతో జనాన్ని ప్రమాదంలో పడేస్తున్న వాట్సాప్(whatsapp) తో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. అన్నీ పర్సనల్ గానే నడుస్తున్నాయి కదా.. అని పర్సనల్ ఛాటింగ్(personal chatings) లు చేస్తున్న చాలామందికి ఇది షాకింగ్ న్యూస్.

ఎందుకంటే.. మీరు పర్సనల్ అని చేస్తున్న ఛాటింగ్ లు, మీ డీటేల్స్ అన్నీ పబ్లిక్ అయిపోతున్నాయట. ఏకంగా గూగుల్(google) లో దర్శనమిస్తున్నాయట.

వాట్సాప్.. తన వినియోగదారుల ప్రైవసీ(privacy) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చాలాసార్లు చెబుతోంది. కానీ ప్రతీసారి లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో లోపం బయటపడింది.


వాట్సాప్ లో ఉన్న ప్రైవేట్ గ్రూప్(whatsapp groups) లకు గూగుల్ ద్వారా యాక్సెస్ అయ్యేలా మారిపోయాయట. అంటే.. మనం వాట్సాప్ లో పర్సనల్ గా ఓ గ్రూప్ పెట్టుకుని అందులో మాట్లాడుకుంటున్నాం. ఆ గ్రూప్ కి గ్రూప్ జాయినింగ్ లింక్)joining link) అని ఉంటుంది. అది కాస్తా ఇప్పుడు గూగుల్ లో పబ్లిక్ అయిపోయిందట.

అంటే... మన గ్రూప్ పేరుకు రిలేటెడ్ గా ఏదైనా కీ వర్డ్(keyword) తో సెర్చ్ చేస్తే.. మన గ్రూప్ లింక్ గూగుల్ లో కనిపించేస్తుంది. ఎవరైనా దానిలో జాయిన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

అంతేకాదు.. ఆ గ్రూప్ లో ఉన్న వారి డీటేల్స్, ప్రొఫైల్స్, మొబైల్ నంబర్స్ అన్నీ గూగుల్ లో కనిపించేస్తున్నాయట. దీనిని గుర్తించిన టెక్నికల్ ఎక్స్ పర్ట్స్... వాట్సాప్ కు సమాచారం అందించారట.


అయితే.. వాట్సాప్ జాయినింగ్ లింక్స్ గూగుల్ లో ఇండెక్స్(index) కావడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆ సంస్థ చెబుతోంది. 2019లోనూ ఇలాంటి సమస్యే వస్తే దాన్ని 2020లో రెక్టిఫై చేశారు. ఇప్పుడు మరోసారి అదే సమస్య వచ్చింది. అయితే.. ఆల్రెడీ no index tag ఇన్ స్టాల్ చేశామని వాట్సాప్ అంటోంది.

కానీ.. ఇప్పటికే 1500 పైగా గ్రూపుల లింక్స్ గూగుల్ లో ఉన్నాయట. బెంగాలీ, మరాఠీ భాషల్లో ఉన్న చాటింగ్స్ ని యాక్సెస్ కూడా చేశామంటూ Gadgets 360 ఓ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది.

ఇప్పటికే వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో జనం పరేషాన్ అవుతున్నారు. ఇప్పుడు ఇలా పర్సనల్ డేటా గూగుల్ లో ప్రత్యక్షం అవుతోందని తెలియడంతో అంతా టెన్షన్ పడుతున్నారు.

- స్వేచ్చ రైతుకా? రైతును దోచుకునే కార్పొరేట్ కంపెనీలకా?

- ఉప్మా బాధితుల సంఘం జిందాబాద్..! ఎన్నాళ్లిలా? ఎన్నేళ్లిలా?

- తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకి కేసీఆరే కారణం!

Next Story
Share it