Top
Batukamma

ప్రేమతో కాఫీ కలిపి ఇస్తే.. నాలుగేళ్లు జైలు శిక్ష వేశారు!

ప్రేమతో కాఫీ కలిపి ఇస్తే.. నాలుగేళ్లు జైలు శిక్ష వేశారు!
X
Highlights

ఇటలీలోని పీడ్‌మాంట్‌కు చెందిన మరియాంగెలా సెరాటో అనే 54 ఏళ్ల మహిళ ఓ ఇన్సురెన్స్ కంపెనీలో వర్క్ చేస్తోంది. అయితే ఆమె తన సహోద్యోగికి రోజు కాఫీ ఇస్తోంది. ఆమెకి తాగాలని లేకున్నా బలవంతంగా అయిన రోజు ఇచ్చేది.

ఓ మహిళ తన సహోద్యోగికి కాఫీ ఇచ్చి జైలు పాలైంది.. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజంగా జరిగింది. అదేంటి కేవలం కాఫీ ఇస్తేనే జైల్లో వేస్తారా అనే అనుమానం రావచ్చు.. కానీ దానివెనుక ఉన్న అసలు కథేంటో తెలుస్తే షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన ఇటలీ దేశంలో చోటు చేసుకుంది.

ఇటలీలోని పీడ్‌మాంట్‌కు చెందిన మరియాంగెలా సెరాటో అనే 54 ఏళ్ల మహిళ ఓ ఇన్సురెన్స్ కంపెనీలో వర్క్ చేస్తోంది. అయితే ఆమె తన సహోద్యోగికి రోజు కాఫీ ఇస్తోంది. ఆమెకి తాగాలని లేకున్నా బలవంతంగా అయిన రోజు ఇచ్చేది.. అయితే సెరాటోను బాధపెట్టడం ఇష్టంలేకా సరే అనే తానూ(సహోద్యోగి) తాగేది... తనని ఇంత బాగా చూసుకున్నందుకు పైగా సంతోషించేది కూడా..

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఓ రోజు ఆమె(సహోద్యోగి) కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు తలతిరగడంతో కారును చెట్టుకు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు బతికి బయటపడింది. అనంతరం వైద్యులు బెడ్ రెస్ట్ తప్పనిసరి అని సూచించడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకోంది. అయితే ఇంట్లో ఉన్న రోజులకి, ఆఫీస్ నుంచి వచ్చాక రోజులకు ఆమె తేడా కనిపించింది.

తలతిరగడం, నీరసంగా ఉండటం, తలనొప్పి, కండరాల నొప్పులు పెట్టడం లాంటివి బెడ్ రెస్ట్ సమయంలో లేవు.. కేవలం ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆమెకి ఈ సమస్యలు వస్తున్నాయని తెలుసుకుంది. దీంతో ఆమెకి సెరాటో మీద అనుమానం కలిగింది.

ఒకరోజు ఎప్పటిలాగే సెరాటో కాఫీ ఇస్తే తీసుకుంది కానీ దానిని తాగలేదు.. దాన్ని తాగుతున్నట్టుగా నటించి నటించి దాన్ని ఓ బాటిల్‌లో పోసుకొని పరీక్షల కోసం పంపించగా దిమ్మతిరగే విషయాలు రిపోర్ట్స్ ద్వారా బయటకు వచ్చాయి..

ఆ కాఫీలో సెరాటో బెంజోడియాజిపైన్ అనే డ్రగ్‌ అధిక మోతాదులో కలిపినట్టుగా తెలిసింది. దీనిద్వారా సదరు మహిళకి తలతిరగడం, నీరసంగా ఉండటం, తలనొప్పి, కండరాల నొప్పులు పెట్టడం లాంటి సమస్యలను ఎదురుకుంది అన్న విషయం అర్ధమైంది. దీనితో సెరాటో పైన వెంటనే కేసు నమోదు చేసింది.

ఇక విచారణలో సెరాటో కూడా నిజాన్ని ఒప్పుకుంది. అయితే ఇలా చేయడానికి గల కారణాన్ని కూడా ఆమె వెల్లడించింది.. వారు పనిచేస్తున్న ఇన్సురెన్స్ కంపెనీలో కాస్ట్ కటింగ్ కోసం ఉద్యోగులను తీసేస్తారని ఆమెకు తెలిసిందని, అందుకే ఈ పని చేసినట్టుగా విచారణలో వెల్లడించింది.

ఆమె కంటే బాగా పనిచేసే తమ క్లయింట్ అనారోగ్యంతో ఉద్యోగం కోల్పోతే తన ఉద్యోగానికి ఎలాంటి సమస్య ఉండదనే కారణంతోనే ఆమె ఇలా చేసిందని మహిళ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో కోర్టు సెరాటోకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.


ఇదే వార్తను ఇంగ్లీష్ లో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story
Share it