ఏపీ సీఎం జగన్ మామ గంగిరెడ్డి మృతి!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మామ, వైఎస్ భారతి నాన్న, పులివెందుల ప్రజలు ముద్దుగా పిలుచుకునే పిల్లల గంగిరెడ్డి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మామ, వైఎస్ భారతి నాన్న, పులివెందుల ప్రజలు ముద్దుగా పిలుచుకునే పిల్లల గంగిరెడ్డి ఇకలేరు...గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవ్వాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.. ఆయన భౌతికంగా లేకపోవడం పులివెందుల ఆ పరిసర ప్రాంతాలకే కాకుండా రాష్ట్రానికే పెద్దలోటు అని చెప్పాలి.. రాష్ట్రం ఓ గొప్ప వైద్యుడిని, మానవతా వాదిని కోల్పోయింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాయి వైద్యానికి పెట్టింది పేరైతే, ఆయన లేని లోటు పులివెందుల, చుట్టుపక్కల అనేక గ్రామాలకు, పక్కన జిల్లాలకు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి తిరుగులేని వైద్యుడు అయ్యారు.
జనం మాటల ప్రకారం ఆయన వైద్యంలో ఏనాడు పొరపాటు జరగలేదని, చిన్న పిల్లలకు ఏ అస్వస్థత చేకూరినా గంగిరెడ్డి సృసిస్తే చాలు మందు కూడ అక్కర్లేదు నయం అయిపోతుంది అనేంతగా ఆయన హస్తవాసి పైన నమ్మకం ఘడించడం వల్లనే ఆయన పిల్లల గంగిరెడ్డి అయ్యారు.
హాస్పిటల్ లో ఎంతో మంది పేదలకు వారి స్థితిగతులను బట్టి తక్కువ ఫీజ్ లకే ఉన్నత వైద్యం, ఉచిత కంటి ఆపరేషన్ లు ఎన్నో చేశారు అలాగే పులివెందులలో పేరు గాంచిన పీడియాట్రిషన్ లు గంగిరెడ్డి దగ్గరే తమ ప్రాక్టీస్ మొదలు పెట్టి గురువుకు తగిన శిష్యులుగా రాణిస్తున్నారంటే ఆయన క్రమశిక్షణ, నిబద్దతే కారణం. ఇక అటు ఆయన అన్నయ్య పెద్ద గంగిరెడ్డి కూడా ఇటీవలే మరణించారు.
ఇక గంగిరెడ్డి స్వగ్రామం కడపజిల్లా వేముల మండలం గొల్లలగూడూరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అయన అంత్యక్రియలు జరగనున్నాయి.. దీనికి సీఎం జగన్ హాజరయ్యే అవకాశముంది.