YSRCP MP Vijayasai Reddy To Quarantine: ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా!

YSRCP MP Vijayasai Reddy To Quarantine: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా సోకిందని తెలుస్తోంది. అయితే ఈ...
YSRCP MP Vijayasai Reddy To Quarantine: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా సోకిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అయన అధికారకంగా ప్రకటించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తానూ వారం నుంచి పది రోజుల వరకు హోం క్వారంటైన్ లోకి వెళ్తున్నట్టుగా స్పష్టం చేశారు. అత్యవసరం అయిన కూడా ఫోన్ లో కూడా అందుబాటులో ఉండనని అయన వెల్లడించారు. దీనితో ఆయనకి కరోనా సోకిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- సీనియర్ నటి ప్రగతి వర్కౌట్ వీడియో
- రెండో భార్య కోసం పూర్తిగా మారుతున్న దిల్ రాజు.. ఈ రొమాంటిక్ పిక్స్ చూశారా!
ఈ నేపధ్యంలో అయన త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం నేతలు వరుస ట్వీట్లు చేస్తున్నారు." విజయసాయిరెడ్డి గారు మీకు నిజంగానే కరోన సంక్రమిస్తే మీరు వైరస్ ని జయించి..రావాలి. టెస్టులు,వైద్యం మన రాష్ట్రం లోనే చేయించుకోండి.మన రాష్ట్ర ప్రజలకి మనోధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది.. విజయోస్తు.. సుఖీభవ..!" అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
https://twitter.com/GORANTLA_BC/status/1285611414762262528?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1285611414762262528|twgr^&ref_url=https://telugu.samayam.com/andhra-pradesh/news/ysrcp-mp-vijayasai-reddy-tested-coronavirus-positive/articleshow/77091447.cms
"రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు.ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం.ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను" అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.
https://twitter.com/BuddaVenkanna/status/1285614298778275841?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1285614298778275841|twgr^&ref_url=https://telugu.samayam.com/andhra-pradesh/news/ysrcp-mp-vijayasai-reddy-tested-coronavirus-positive/articleshow/77091447.cms
"రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకి అందరం ఒకటే. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.
https://twitter.com/Anitha_TDP/status/1285600322774355971
వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 53,724 కోవిడ్ -19 కేసులు ఉన్నాయి.